పులి రిలీజ్ అయ్యిన తర్వాత దర్శకుడు ఎస్.జె సూర్య ఆ చిత్రం బాగా లేటైపోయింది అని,టైం వేస్ట్ అయిపోయిందని భాధపడుతున్నాడు. అప్పుడు నాకు ఫైనాన్సియల్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆ సమయంలో సూర్య నాకు దర్శకుడు విష్ణుని తీసుకొచ్చి పరిచయం చేసాడు. అతన్ని చూడగానే అతను కష్టపడటానికి సిద్దంగా ఉన్నాడని అన్నాడు. కొద్ది రోజులు మాట్లాడుకున్నాక ఓ కంక్లూజన్ కి వచ్చాం అన్నారు అంటూ పంజా చిత్రం మెటీరియలైజ్ అయ్యిన విధానం గురించి చెప్పుకొచ్చారు. అలాగే మీకు ఈ సినిమా పై మీ అబిమానుల నుంచి ప్రెజర్ ఉంటుందా అంటే...పవన్ సమాధానమిస్తూ..అభిమానుల వైపే కాకుండా ఆర్దికపరమైన,ఫైనాన్సియల్ ప్రెజర్స్ కూడా ఉంటాయి అని మళ్లీ ప్రస్తావించారు. ఇక పంజా వర్కింగ్ తర్వాత నెక్ట్స్ వెంటనే పనిలోకి వెళ్ళిపోతున్నారా అని అడిగితే..ఇదివరకు నాకు ఆ జీల్ ఉండేది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్దితుల వల్ల వెంటవెంటనే చేయాల్సి వస్తుంది అన్నారు. ఇక ఈ చిత్రాన్ని పంజాని ఎంటర్టైనింగ్ మాఫియాగా చెప్పుకోవచ్చు అన్నారు.
బ్రహ్మానందంగారితో చేసిన పాట బాగా వచ్చింది. ఈ చిత్రంలో నా పాత్ర విషయానకి వస్తే.. మంచి వ్యక్తిత్వం గల ఆ పాత్ర నచ్చింది. అతని కుటుంబం, ఆ జ్ఞాపకాలు, లాయల్టి ఇవన్నీ ఆ క్యారెక్టర్ లో కనపిస్తాయి. అబిమానుల అంచనాలకు తగ్గిట్టుగానే చేసాను అని తన మనస్సులో మాటను చెప్పుకొచ్చారు. పంజా చిత్రం ఈ నెల తొమ్మిదవ తేదిన విడుదల అవుతోంది.దేశంలోని బెస్ట్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన పి.ఎస్. వినోద్ అందించిన ఛాయాగ్రహణం ఈ సినిమాకి ఎస్సెట్. సినిమా అంతా విజువల్ ఫీస్ట్‌గా కనిపిస్తుందంటే కారణం ఆయనే. అలాగే చక్కని ఎంటర్‌టైన్‌మెంట్ కూడా పంజాలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల వాణిజ్య అంశాల్ని సమపాళ్లలో మేళవించిన సినిమా. ఇలాంటి సబ్జెక్టును విష్ణువర్ధన్ అయితే బాగా డీల్ చేస్తారని పవన్ కల్యాణ్‌కు డైరెక్టర్ ఎస్.జె. సూర్య చెప్పడంతో ఆయన ఈ ప్రాజెక్టులోకి వచ్చారు. విష్ణు 'పంజా' కథని నడిపిన విధానం కానీ, ఆయన టేకింగ్ కానీ అత్యున్నత ప్రమాణాల్లో ఉన్నాయి. ఈ సినిమా తర్వాత ఆయనకు తెలుగులో బ్రహ్మాండమైన డిమాండ్ ఏర్పడుతుంది అన్నారు.