చిరంజీవి 150వ చిత్రానికి కథ రాసి విన్పించడం జరిగిందని స్టార్ రైటర్ చిన్ని కృష్ణ మీడియాకు తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే పవన్‌కళ్యాణ్, ఎన్టీఆర్‌ల కోసం రెండు కథలు రాయడం జరిగిందని తెలిపారు. అమీర్‌ఖాన్‌కి కూడా త్వరలో ఓ కథ అదించబోతున్నట్లు చిన్నికృష్ణ చెప్పారు. గతంలో నరసింహా, నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి, బద్రీనాథ్ చిత్రాలకు కథ అందించిన చిన్నికృష్ణ తాజాగా ఓంకార్ దర్శకత్వంలో, దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘జీనియస్’ చిత్రానికి చిన్నికృష్ణ కథ అందిస్తున్నారు. ఈ చిత్రంలోనూ హైలెట్ సీన్స్ ఉన్నాయని చెప్తూ...‘తాము రాసిన సినిమాల్లో గొప్ప సన్నివేశం అనదగ్గదాన్ని ‘కోటి రూపాయల సీన్’గా అభివర్ణించడం మా రచయితలకు అలవాటు. ఆ రకంగా నా సినిమాల్లో అలాంటి సీన్స్ గురించి చెప్పాలంటే... ‘నరసింహ’లో పైనున్న ఊయలను రజనీకాంత్ కిందకు లాగి స్టైల్‌గా కూర్చునే సన్నివేశం ఉంది.
నా దృష్టిలో అది ‘కోటి రూపాయల సీన్’! అలాగే ‘నరసింహనాయుడు’లో బాలకృష్ణ తన అన్నల కుటుంబాలను కాపాడి రెలైక్కించే సీన్! ‘ఇంద్ర’లో చిరంజీవి తన యావదాస్థినీ త్యాగం చేసి కాశీకి వెళ్లే సీన్! ‘గంగోత్రి’లో ప్రకాష్‌రాజ్‌పై అల్లు అర్జున్ ఛాలెంజ్ విసిరే సీన్! ‘బద్రీనాథ్’లో ఇంటర్వెల్ సీన్!.అలాంటి సన్నివేశమే ‘జీనియస్’లో కూడా ఒకటుంది. మూడురోజుల క్రితమే ఆ సీన్‌కి పరుచూరి గోపాలకృష్ణగారు అద్భుతంగా మాటలు రాశారు’’ అన్నారు.అలాగే ఈ సినిమాకు పనిచేయడం బాధ్యతగా ఫీలవుతున్నాను. ఎందుకంటే- కొత్త్త దర్శకుడు, నిర్మాత, ఆర్టిస్టులతో పనిచేయడం నాకు ఇదే ప్రథమం. అయితే, ఈ బాధ్యతను నాతోపాటు పరుచూరి బ్రదర్స్ కూడా పంచుకోవడం వలన కాస్త రిలీఫ్‌గా ఉంది’’ అన్నారు.యూనివర్సిటీల నేపథ్యంలో సాగే కథ ‘జీనియస్’ అని, పదేళ్ల పాటు విద్యాలయాలపై రీసెర్చ్ చేసి ఈ కథ తయారు చేశానని చెబుతూ, విద్యార్థులకు ఈ కథను అంకితం చేస్తున్నట్లు తెలిపారు.